బ్రేకింగ్... తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు... మూడు బోగీలు దగ్ధం!
- హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి రైలు
- ఫరీదాబాద్ సమీపంలో ఘటన
- ప్రయాణికులు సురక్షితం
వెంటనే గుర్తించిన రైలు సిబ్బంది, నిప్పంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. మరో గంటలో రైలు గమ్యానికి చేరుతుందనగా ఫరీదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.