: తప్పు ఒప్పుకున్న అంకిత్ చవాన్
మొత్తానికి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు అంకిత్ చవాన్ తన తప్పును అంగీకరించాడు. ముగ్గురు క్రికెటర్లు, ఇతర బుకీలను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితులను విచారించడం ప్రారంభించారు. "అవును నేను తప్పు చేశాను" అని అంకిత్ ఈ సందర్భంగా అంగీకరించినట్లు సమాచారం.