: లోక్ పాల్ పై కాంగ్రెస్ తత్వం అదే : వెంకయ్యనాయుడు


యూపీఏ సర్కార్ పై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని స్వతంత్ర ప్రతిపత్తి విభాగాలను ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఉసిగొల్పుతోందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు కూడా వారి కనుసన్నల్లోనే జరుగుతోందని హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. అందుకు మధుకోడా, మాయావతి కేసుల విచారణే నిదర్శనమని ఆయన అన్నారు.

అంతేకాక, వివిద రాష్ట్రాలలో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇన్ కమ్ టాక్స్ శాఖలను కాంగ్రెస్ తన రాజకీయ శత్రువులపై ప్రయోగిస్తోందని వెంకయ్యనాయుడు ఆరోపించారు. అటు లోక్ పాల్ బిల్లులో సీబీఐని చేర్చకపోవటంతో కాంగ్రెస్ తత్వం బయటపడిందన్నారు. ఏదేమైనా,
పటిష్టమైన లోక్ పాల్ బిల్లుకు మాత్రమే బీజేపీ మద్దతు ఇస్తుందని వెంకయ్య స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News