: ఐపీఎల్ ఫిక్సింగ్.. చెన్నైలో సోదాలు
ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణల నేపధ్యంలో చెన్నైలో పోలీసులు 8 చోట్ల సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఐదుగురు బుకీలను అరెస్టు చేసిన పోలీసులు, వారి ద్వారా మరింత సమాచారం సేకరించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు మరిన్ని ప్రదేశాల్లో జరిగే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు ఫిక్సర్లపై నిఘా వేసిన సంగతి తెలిసిందే.