: హత్యలకు వ్యతిరేకంగా నెల్లూరులో మిన్నంటిన నిరసనలు
డబ్బు కోసం ఇద్దరిని కిరాతకంగా హత్య చేసిన దారుణానికి వ్యతిరేకంగా నెల్లూరు ప్రజలు రగిలిపోయారు. మంగళవారం జరిగిన హత్యలకు వ్యతిరేకంగా నేడు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, విద్యార్థులు నిరసన, ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
పట్టపగలే ఇంట్లోకి చొరబడి తల్లీ కూతుర్లను చంపిన ముగ్గురు కిరాతకులను ఉరి తీయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన రహదారులపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరసనకారులు పట్టణంలో షాపులను బలవంతంగా మూసివేయిస్తున్నారు.