Andhra Pradesh: పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు: చంద్రబాబు
- రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా
- నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి? సరిచేసుకుంటా
- నా కష్టాన్ని ప్రజలు గుర్తించలేకపోయారన్న బాధ ఉంది
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు స్పందించారు. గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అన్నీ ఈయన (చంద్రబాబు) చేశాడు, ఇంకొక ఆయన వస్తాడు.. పొడుస్తాడని అనుకున్నారు. ఇప్పుడు, పాలిచ్చే ఆవును వదిలిపెట్టుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అడుగుతున్నా. నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి? సరిచేసుకుంటా. నా కష్టాన్ని ప్రజలు గుర్తించలేకపోయారన్న బాధ వుంది. ప్రజలు బాధపడుతుంటే చూడలేకపోతున్నా’ అని అన్నారు.