Sujita: భాగ్యరాజాగారు అలా చేసినందుకు అమ్మ చాలా బాధపడింది: నటి సుజిత

  • భాగ్యరాజాగారి సినిమాలో చేశాను
  •  ఆ సీన్ ఆ సినిమాలో చాలా కీలకం 
  • ఊర్వశి గారు నన్ను గుళ్ల చుట్టూ తిప్పారట 

'పసివాడి ప్రాణం' సినిమాలో మూగ పిల్లవాడిగా చేసిన చేసిన బేబీ సుజిత, ఆ తరువాత కాలంలో పలు టీవీ సీరియల్స్ చేస్తూ పాప్యులర్ అయింది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. "భాగ్యరాజా గారి ఒక తమిళ సినిమాలో నేను పసిపాపగా కనిపిస్తాను. ఆ సినిమాలో నా పై నుంచి నటి ఊర్వశి గారు దాటి వెళతారు. అది ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్.

పసిపాపను ఎవరైనా దాటివెళితే ఆ పాపకి ఏదైనా కీడు జరుగుతుందని పెద్దలు నమ్మేవారట. అందువలన దర్శకుడు భాగ్యరాజా గారు ఏదో కారణంగా అమ్మను అక్కడి నుంచి కాస్త దూరంగా పంపించివేసి ఆ సీన్ తీశారు. ఆ తరువాత ఈ విషయం తెలిసి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ మనసును ఊర్వశిగారు అర్థం చేసుకుని నాకు దిష్టి తీయడమే కాకుండా, చాలా ఆలయాలకు తీసుకెళ్లారట" అని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News