నిరసన కార్యక్రమంలో నవ్విన జయబచ్చన్.. విరుచుకుపడుతున్న నెటిజన్లు
- ఉన్నావో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసన
- పాల్గొన్న ఎస్పీ, టీఎంసీ సభ్యులు
- ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఆమె నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. వాటిని చూసినవారు జయబచ్చన్పై మండిపడుతున్నారు. దేశాన్ని కుదిపేస్తున్న ఓ తీవ్రమైన అంశంపై నిరసన తెలుపుతున్న సమయంలో ఈ నవ్వులేంటంటూ మండిపడుతూ ట్రోల్ చేస్తున్నారు. వారి తీరు చూస్తుంటే బాధితురాలికి అండగా నిరసన తెలుపుతున్నట్టు కనిపించడం లేదని, తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.