పాక్ జైళ్లలో వున్న మన జాలర్లను విడిపించండి: కేంద్ర విదేశాంగ మంత్రిని కోరిన వైసీపీ ఎంపీలు
- చేపల వేటకు వెళ్లి పాక్ జలాల్లోకి ప్రవేశించిన జాలర్లు
- అదుపులోకి తీసుకున్న పాక్ గస్తీ బృందం
- 21 మంది జాలర్లను విడిపించాలని కోరిన వైసీపీ ఎంపీలు
శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన జాలర్లు కొందరు గుజరాత్లోని వారావల్ ప్రాంతానికి బతుకుదెరువు కోసం వెళ్లారు. ఈ నేపథ్యంలో చేపల వేటకని, నాలుగు మెక్నైజ్డ్ బోట్లలో పయనమై అరేబియా సముద్రంలోకి వెళ్లారు. వీటిలో మూడు బోట్లలో వున్న 21 మంది చేపల్ని వేటాడుతూ, పొరపాటున భారత సరిహద్దు దాటి పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి గస్తీ దళాలకు చిక్కాయి.