: వాటికన్నా కాఫీ, టీలే నయం...


కాఫీ, టీలు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని మనలో చాలామంది అంటుంటారు. అయితే అలాంటి వారు ఎండలో అలా బయటికి వెళ్లనపుడు చక్కగా కూల్‌డ్రింక్స్ కి ఆర్డరిస్తుంటారు. ఇది మంచిది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. కూల్‌డ్రింక్స్ కన్నా కాఫీ, టీలే నయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పిటల్‌ పరిశోధకులు మూడు రకాలైన అధ్యయనాలను నిర్వహించి ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు.

చక్కెరలతో తయారు చేసిన శీతల పానీయాలను తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని, అదే టీ, కాఫీ, నారింజరసం వంటి వాటిని తాగే వారిలో ఈ ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ ఒక కూల్‌డ్రింకు తాగేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు 23% ఎక్కువగా ఉందని, కోలాలు, ఇంకా ఇతర తీపి పానీయాలతోనూ ఈ ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు అంటున్నారు.

నిజానికి ఎక్కువగా ద్రవాలను తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. అయితే ఆయా వ్యక్తులు తీసుకునే ద్రవాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన పీట్రో మాన్యుయేల్‌ ఫెరారో అంటున్నారు. అంతేకాదు తాము కనుగొన్న ఈ విషయం కిడ్నీలో ఏర్పడిన రాళ్లను తగ్గించేందుకు అవసరమైన చికిత్సలను ఎంచుకునేందుకు వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఫెరారో అంటున్నారు. కాబట్టి... తాగాలనుకుంటే ఏ నారింజ రసమో... కాఫీనో, టీనో తాగండి... కూల్‌డ్రింకులకు ఆర్డరివ్వకండేం...!

  • Loading...

More Telugu News