Chandrababu: చిరుద్యోగులు ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కి పోరాడాల్సిరావడం దురదృష్టకరం: చంద్రబాబు
- గత ఐదేళ్లలో ఇలాంటి నిరసనలు లేవన్న మాజీ సీఎం
- అందరి సంక్షేమమే పరమావధిగా పనిచేశామంటూ ట్వీట్
- చిరుద్యోగులకు టీడీపీ తోడుగా నిలుస్తుందని వెల్లడి
ఇటీవల కాలంలో రాష్ట్రంలో చిరుద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తుండడం మీడియాలో తరచుగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత ఐదేళ్లలో చిరు వేతన జీవులు ఈ విధంగా ఎప్పుడూ రోడ్డెక్కలేదని పేర్కొన్నారు. తమకు వీలైనంతగా అందరి సంక్షేమమే పరమావధిగా పనిచేశామని, కానీ ఇప్పుడు చిరుద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం పోరాటాలు చేయాల్సిరావడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. వారి పోరాటంలో తాము తోడుగా నిలుస్తామని చెబుతూ సంఘీభావం ప్రకటించారు.