పక్కా 'బిజినెస్ మేన్'.. సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు!
- ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిన మహేశ్
- తాజాగా దుస్తుల వ్యాపారంలోకి అడుగు
- మరో రెండు రోజుల్లో బ్రాండ్ పేరు ఆవిష్కరణ
దీన్ని మహేశ్ బాబు తన అభిమానులతో పంచుకున్నారు. ఇంకో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఈ వెబ్ సైట్ లోకి లాగిన్ కావడం ద్వారా ప్రిన్స్ మహేశ్ బాబును అభిమానులు కలుసుకోవచ్చని తెలుస్తోంది. నటులు విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో ఇప్పటికే సొంత బ్రాండ్ ను ప్రారంభించగా, బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్, సోనమ్ కపూర్, అనుష్కా శర్మ, దీపికా పదుకునే, సన్నీ లియోన్ తదితరులు కూడా సొంత దుస్తుల బ్రాండ్లను నడుపుతున్నారు.