: సాకర్ కు గుడ్ బై చెప్పనున్న బెక్ హామ్


స్టయిల్ కు పర్యాయపదంలా నిలిచే సాకర్ స్టార్లలో డేవిడ్ బెక్ హామ్ (38) తర్వాతే ఎవరైనా. ఈ ఇంగ్లిష్ ఆటగాడు ప్రతి మ్యాచ్ కు తనదైన హెయిర్ స్టయిల్ తో బరిలో దిగి వీక్షకులను ఆకట్టుకుంటాడు. ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేయడం అటుంచి, తన ఉనికితోనే అందరి దృష్టిని తనవైపుకు మళ్ళించుకుంటాడు. ఏళ్ళ తరబడి ఫ్యాన్స్ ను తన ఫుట్ బాల్ నైపుణ్యంతో అలరించిన ఈ ఫ్యాషన్ బాయ్ ఇక సాకర్ కు గుడ్ బై చెబుతానంటున్నాడు. ఈ సీజనే తనకు చివరిదంటున్నాడు.

ఇంగ్లండ్ జట్టుకు 115 మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించిన బెక్ హామ్.. ఓ దశలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరుగాంచాడు. సాకర్ లీగుల్లో ప్రఖ్యాత క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, లాస్ ఏంజెల్స్ గెలాక్సీ, ఏసీ మిలాన్ జట్లకు బెక్ హామ్ ప్రాతినిధ్యం వహించాడు. 2000-06 మధ్యకాలంలో ఇంగ్లండ్ జట్టుకు ఈ స్టార్ ఆటగాడు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేగాకుండా మూడు ప్రపంచకప్ లలోనూ పాల్గొన్నాడు.

  • Loading...

More Telugu News