చిన్న పొరబాటు చేసిన అమెజాన్... పండగ చేసుకున్న కస్టమర్లు!
- ఖరీదైన కెమెరాలను చీప్ గా దక్కించుకున్న వినియోగదారులు
- రూ.9 లక్షల విలువైన కెమెరా రూ.6,500కే లభ్యమైన వైనం
- అవాక్కయిన అమెజాన్!
అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా ఓ అత్యాధునిక కెమెరాపై కూడా ఆఫర్ ఇచ్చింది. అయితే, కొనుగోలు ధరను కేవలం రూ.6,500గా పేర్కొనడంతో కస్టమర్లు కుమ్మేశారు. దీని అసలు ఖరీదు రూ.9 లక్షలు. సోనీ ఎ6000 కెమెరాకు కూడా ఇదే గతి పట్టింది. దీని వాస్తవ ఖరీదు రూ.4 లక్షలు కాగా, వినియోగదారులు దీన్ని సైతం అత్యంత చవకగా రూ.6,500కి దక్కించుకున్నారు.
అయితే, తాము అత్యంత చీప్ గా కొన్న కెమెరాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టేసరికి అమెజాన్ చూసి అవాక్కయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారీ సంఖ్యలో ఖరీదైన కెమెరాలకు రెక్కలొచ్చాయి. చేసేదేమీలేక అప్పటికి బుక్ అయిన ఆర్డర్లను మాత్రం రద్దు చేసిన అమెజాన్ ఉసూరుమంది.