India: జడేజా అవుట్... ధోనీ కొట్టేనా?
- సెమీస్ భారమంతా ధోనీపైనే
- విజయానికి 12 బంతుల్లో 31 చేయాలి
- న్యూజిలాండ్ తో సెమీస్
మాంచెస్టర్ లో జరుగుతున్న టీమిండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ సమరం చివర్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. బాగా ఆడుతున్న జడేజా అవుట్ కావడంతో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. జడేజా 77 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 48 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు కాగా, విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి. క్రీజులో ధోనీ, భువనేశ్వర్ ఉన్నారు.