Chandrababu: వైసీపీ దాడికి పాల్పడిందా?... మీరు డయల్ చేయాల్సిన నంబర్ ఇదే: చంద్రబాబు
- తమపై దాడులు జరుగుతున్నాయంటున్న తెలుగు తమ్ముళ్లు
- చంద్రబాబు ఆందోళన
- ప్రత్యేక విభాగం ఏర్పాటు
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక తమ కార్యకర్తలపై వందల సంఖ్యలో దాడులు జరిగాయని, కొందరు మరణించారని టీడీపీ నేతలు ఇప్పటికే డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై పార్టీపరంగానూ చర్యలు తీసుకునేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడితే ఈ విభాగానికి వెంటనే ఫిర్యాదు చేయాలంటూ ప్రత్యేక ఫోన్ నంబర్ (73062 99999) ను కూడా ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.