: ఆటో డ్రైవర్ భార్య నిర్బంధం


వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఆస్తులపై కన్నేసి జప్తులు చేసుకున్న కాబూలీలు తాజాగా వడ్డీ డబ్బులు కట్టలేదంటూ, అప్పుతీసుకున్న వారు ఆడా మగా అని కూడా చూడకుండా నిర్బంధిస్తున్నారు. అప్పు చెల్లించలేదంటూ కర్నూలులో ఓ గిరిజనుడ్ని నాలుగు రోజులుగా నిర్బంధించిన విషయం వెలుగులోకి వచ్చి 24 గంటలు గడవకముందే, ఒంగోలులో బకాయి చెల్లించలేదని ఆటోడ్రైవర్ భార్యను నిర్బంధించాడో వడ్డీ వ్యాపారి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి వ్యాపారి నుంచి ఆటో డ్రైవర్ భార్యకు విముక్తి కల్పించారు.

  • Loading...

More Telugu News