Jagan: సీఎం జగన్ ను కలిసిన బీమామిత్ర సభ్యులు.. గౌరవ వేతనం ప్రకటించిన ముఖ్యమంత్రి
- 12 ఏళ్లుగా తమ సమస్యలు పట్టించుకోవడంలేదంటూ ఆవేదన
- ఇన్నాళ్లు ఎలాంటి గౌరవవేతనం లేకుండా పనిచేశామన్న బీమామిత్ర సభ్యులు
- సీఎం జగన్ రూ.3 వేల గౌరవవేతనం ప్రకటించారంటూ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీమామిత్ర సభ్యుల ప్రతినిధులు ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 12 ఏళ్లుగా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఎలాంటి గౌరవవేతనం లేకుండానే పనిచేశామని, ఇప్పుడు సీఎం జగన్ తమకు రూ.3 వేల గౌరవవేతనం ప్రకటించారని బీమామిత్ర సభ్యులు వెల్లడించారు. ఒక బీమా క్లెయిమ్ కు రూ.250 నుంచి రూ.1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తమ సమస్యల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, వెంటనే సమస్యలు పరిష్కరించినందుకు ఆయనకు రుణపడి ఉంటామని బీమామిత్ర సభ్యులు పేర్కొన్నారు.