Andhra Pradesh: మరో ముగ్గురికి కీలక పదవులు ఇచ్చిన వైఎస్ జగన్!
- ఐటీ విభాగంలో సలహాదారుల నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ
- త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్న ముగ్గురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురిని నియమిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. దేవిరెడ్డి శ్రీనాథ్, జె.విద్యాసాగర్ రెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా, కె.రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడుల విభాగానికి విధాన సలహాదారుగా నియమించారు. వీరంతా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.