Andhra Pradesh: టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి: చంద్రబాబు
- ఇప్పటికే ఆరుగురు కార్యకర్తలను చంపేశారు
- ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్నాం
- టీడీపీకి మూలస్తంభాలు కార్యకర్తలే
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని అన్నారు. టీడీపీకి ఓ చరిత్ర ఉందని, నలభై శాతం ఓట్లేసిన ప్రజల కోసం తాము పనిచేస్తామని, నీతివంతమైన పాలన అందించామని చెప్పారు. టీడీపీకి మూలస్తంభాలు కార్యకర్తలేనని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరుగురు కార్యకర్తలను చంపేశారని అన్నారు. ప్రతి కార్యకర్తని కాపాడుకుంటూ, వారికి అండగా ఉంటున్నామని చెప్పారు.