: 15 నుంచి 17 మధ్యలో అకాల వర్షాలు
రాష్ట్రంలో రైతులకు కష్టకాలం పొంచి ఉంది. ఈ నెల 15 నుంచి 17 వరకూ భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా తెలంగాణ సహా రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు రావడానికి ఆస్కారం ఉందని ప్రకటించింది.
అయితే, తెలంగాణపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 16న భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపింది. పంటల సంరక్షణకు రైతులు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని సూచించింది.