: ఫిక్సింగ్ తీగ లాగితే పాక్ డొంక కదులుతోంది


ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్ సహా మరో ఇద్దరు అరెస్టయిన నేపథ్యంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిక్సింగ్ దందా యావత్తూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లోనే సాగుతున్నట్టు సమాచారం. క్రికెటర్లతోపాటు అరెస్టయిన ఏడుగురు బుకీలను ఢిల్లీ పోలీసులు నేడు విచారించారు. దావూద్ తో వీరికి సంబంధాలున్నాయని పోలీసులు అంటున్నారు. వీరికి వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ పాకిస్తాన్ నుంచే రావడం చూస్తుంటే, దావూద్ హస్తం ఉండే ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ముంబయి బాంబు పేలుళ్ళ ఘటన అనంతరం దావూద్ పాకిస్తాన్ చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈ డాన్ తన నేర సామ్రాజ్యాన్ని పాక్ నుంచే పర్యవేక్షిస్తున్నాడు.

  • Loading...

More Telugu News