పవన్ కల్యాణ్ అభిమానులే కాదు ఏపీ ప్రజలూ ఊహించి ఉండరు!: పరుచూరి గోపాలకృష్ఱ
- పవన్ కల్యాణ్ పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు
- పవవ్ ఓడిపోవడం మరో ఎత్తు
- పవన్ ని గెలిపించకపోవడం నమ్మశక్యం కాని నిజం
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో తెలియదు గానీ, పవన్ కల్యాణ్ పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, ఆయన ఓడిపోవడం మరో ఎత్తు అని గోపాలకృష్ణ అన్నారు. పవన్ కల్యాణ్ ఓటమి పాలవుతారని ఆయన అభిమానులే కాదు ఏపీ ప్రజలు కూడా ఊహించి ఉండరని అన్నారు. పవన్ అసెంబ్లీలో అడుగుపెడతాడనే తానూ భావించానని చెప్పారు. ప్రశ్నించే హక్కు గురించి అనుక్షణం మాట్లాడుతున్న పవన్ ని ప్రజలు గెలిపించకపోవడం నమ్మశక్యం కాని నిజం అని వ్యాఖ్యానించారు. పవన్ కోరుకున్న ‘మార్పు’ ఇంకా రాలేదని, ఆ ‘మార్పు’ను ఆయన తీసుకొస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.