: త్వరలోనే కరెంటు కష్టాలకు చెక్: జ్యోతిరాధిత్య సింధియా
ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ సమస్యలు తీరనున్నాయి. ఢిల్లీలో సీనియర్ మంత్రులను కలిసేందుకు వెళ్ళిన సీఎం కిరణ్ రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టేందుకు నడుం బిగించారు. ఆజాద్ తో సమావేశం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు గ్యాసు, బొగ్గు కేటాయించాలంటూ విజ్ఞప్తి చేసారు. అయితే ఇప్పటికే విద్యుత్ కేటాయింపు విషయం తమ పరిశీలనలో ఉందనీ, మంత్రుల బృందం ఆమోదం తెలిపిన వెంటనే నిర్ణయం తీసుకుంటామనీ అన్నారు. ఇప్పటికే 395 మెగావాట్ల అదనపు విద్యుత్ ను రాష్ట్రానికి కేటాయించామని, సదరన్ గ్రిడ్ ను వచ్చే ఏడాది జాతీయ గ్రిడ్ తో అనుసంధానిస్తామని తెలిపారు. త్వరలోనే కరెంటు కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు.