: లొంగిపోయిన సంజయ్ దత్
ముంబయి వరుస పేలుళ్ళ కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నేడు కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో సుప్రీం ఆయనకు ఐదేళ్ళ జైలుశిక్ష విధించగా.. ముంబయిలోని టాడా కోర్టు ఎదుట ఈ మధ్యాహ్నం హాజరయ్యారు. పోలీసులు సంజయ్ దత్ ను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కోర్టు వద్దకు తరలించారు. 1993లో జరిగిన పేలుళ్ళ ఘటన సందర్భంగా అక్రమాయుధాలు కలిగి ఉన్న నేరంపై సంజయ్ దత్ కు అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కాగా, నిన్న ఈ బాలీవుడ్ నటుడు తనకు మతతత్వ సంస్థల నుంచి ప్రాణహాని ఉందని, అందుకే నేరుగా పుణే యెరవాడ జైల్లో లొంగిపోతానని విన్నవించుకోగా, కోర్టు తోసిపుచ్చింది.