ఆర్ధికశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం... బడ్జెట్ రూపకల్పనపై కసరత్తులు
- అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న సీఎం
- నవరత్నాలు, ప్రాజక్టులకు నిధుల సమీకరణపైనా సమీక్ష
- హాజరైన మంత్రి బుగ్గన
ఏ రంగానికి ఎంతమేర కేటాయింపు చేయాలన్న విషయాలను కూడా జగన్ ఆర్థికమంత్రితో చర్చించారు. బడ్జెట్ మొత్తం నిర్ధారించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని కూడా జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికిప్పుడు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలు ప్రారంభిస్తే రాష్ట్రంపై పడే భారం ఎంత అని ప్రత్యేకంగా అడిగినట్టు తెలుస్తోంది.