Telangana: కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద లిఫ్ట్ అద్దాలు బద్దలుకొట్టి మంత్రి జగదీశ్ రెడ్డిని బయటికి తీసుకొచ్చిన సిబ్బంది
- లిఫ్ట్ లో చిక్కుకుపోయిన మంత్రి
- మొరాయించిన లిఫ్ట్
- గంటసేపు బందీగా మారిన జగదీశ్ రెడ్డి!
కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఓ లిఫ్ట్ లో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ రోజు చిక్కుకుపోయారు. లిఫ్ట్ కదలకుండా మొరాయించడంతో జగదీశ్ రెడ్డి అనుకోని విధంగా బందీ అయ్యారు! అధికారులు అనేక ప్రయత్నాలు చేసినా లిఫ్ట్ పనిచేయకపోవడంతో అధికారులు అద్దాలు పగులగొట్టి మంత్రిని బయటికి తీశారు. దాదాపు గంటసేపు జగదీశ్ రెడ్డి లిఫ్ట్ లోనే ఉండిపోయారు. ఎట్టకేలకు మంత్రి బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.