ప్రధాని మోదీతో సుజనా, టీజీ, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ భేటీ!
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమావేశం
- ఏపీలో బీజేపీ పటిష్టత, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- నలుగురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్
ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, బీజేపీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఈ నలుగురు నేతలకు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. వీరి చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 75కు చేరుకుంది.