Andhra Pradesh: టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో సమావేశం
- తాజా పరిణామాలపై చంద్రబాబు ఆరా
- పార్టీ వర్గాల సమాచారం
తమ ఎంపీలు బీజేపీలో చేరడంపై టీడీపీీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తమ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్టు సమాచారం. తాడేపల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న నేతలతో ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై చంద్రబాబు ఆరా తీసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.