చంద్రబాబుకు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న సీఎం రమేశ్, సుజనా, గరికపాటి, టీజీ వెంకటేశ్?
- ఇప్పటికే అమిత్ షా, మోదీతో భేటీ
- ఈరోజు సాయంత్రం వెంకయ్యనాయుడితో సమావేశం
- తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరనున్న సభ్యులు
ఇప్పటికే ఈ విషయమై నలుగురు నేతలు బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ఈ నలుగురు సభ్యులు కోరనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాగా, మిగిలిన ఇద్దరు సభ్యులు తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ ను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వెల్లడించాయి. ఈ బాధ్యతలను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించినట్లు పేర్కొన్నాయి.