: బావతో బాలయ్య సుదీర్ఘ చర్చలు


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని నేడు సినీనటుడు బాలకృష్ణ కలిశారు. బాబుతో ఆయన నివాసంలో బాలకృష్ణ ఈ ఉదయం నుంచి సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదంతో బాబు, హరికృష్ణల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో బాలయ్య.. బాబుతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బావ, అన్న మధ్య సఖ్యత కుదర్చడం ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన బాధ్యతగా తెలుస్తోంది. హరికృష్ణ మహానాడుకు వస్తేనే నందమూరి కుటుంబం టీడీపీ పక్షాన ఉన్నట్టు ప్రజలు విశ్విస్తారని బాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యను హరికృష్ణ వద్దకు రాయబారం పంపేందుకు బాబు నిశ్చయించుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News