: స్వచ్ఛంద రక్తదాతల వివరాలతో వెబ్ సైట్
రక్తహీనతా... డాక్టర్లు రక్తం ఎక్కించాలన్నారా? ప్రమాదం బారిన పడ్డారా... రక్తం అత్యవసరమా... అందుబాటులో ఆప్తులెవరూ లేరా? అయినా చింతించకండి. రక్తం అవసరమైన రోగులకు స్వచ్ఛంద రక్తదాతల వివరాలు అందించేందుకు ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా రక్తం అందించే రక్తదాతల వివరాలు ఫోన్ నెంబర్లతో సహా అందుబాటులో ఉంటాయని వెబ్ నిర్వాహకులు తెలిపారు. www.friendstosupport.org అనే వెబ్ సైట్ లో ఓపెన్ డేటాబేస్ ను అందుబాటులో ఉంచారు. రక్తదానంలో దళారుల పాత్రను రూపుమాపడమే ధ్యేయంగా రక్త దాతల ఉదారతను చాటేందుకు ఫోన్ నెంబర్లను కూడా బహిర్గతం చేయడమే ఈ సైట్ లక్ష్యమని దీన్ని ప్రారంభించిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.