: పాక్ లో సరబ్ జిత్ లాయర్ కిడ్నాప్


భారత అనుకూల లాయర్ అవాయిస్ షేక్, ఆయన కుమారుడిని పాక్ లో గుర్తు తెలియని దుండగులు ఈ ఉదయం అపహరించుకుపోయారు. ఇటీవలే పాకిస్థాన్ లోని లాహోర్ జైలులో తోటి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన భారత ఖైదీ సరబ్ జిత్ క్షమాభిక్ష కోసం అవాయిస్ తీవ్రంగా శ్రమించారు. అంతేకాదు, భారత ఖైదీలకు సంబంధించిన కేసులలోనూ ఆయన వాదించడానికి చొరవ చూపేవారు. భారతీయుల హక్కుల కోసం పోరాడే లాయర్ గా అవాయిస్ కు గుర్తింపు ఉంది. ఫార్మ్ హౌస్ కోసం భూమిని కొందామని అవాయిస్ కొడుకు షారూక్ తో కలిసి బుర్కి హుదైరా గ్రామానికి ఈ ఉదయం వెళ్లారు. పోలీస్ యూనీఫాంలో వచ్చిన ఇద్దరు వారిని అపహరించుకుపోయినట్లు సమాచారం. పోలీసులు వెంటనే వెతుకులాట ప్రారంభించారు.

  • Loading...

More Telugu News