Telangana: మద్యం మత్తులో జోరుగా చిందులేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు
- తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల బహిరంగ మద్యపానం
- రెచ్చిపోయి డ్యాన్సులేసిన కమిటీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది
- సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొందరు వ్యవసాయ మార్కెట్ అధికారులు తమ స్థాయిని మరిచి మద్యం మత్తులో ఊగిపోయారు. తాగిన మైకంలో డ్యాన్సులు చేస్తూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీడియాలో విశేషంగా ప్రసారమవుతోంది. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారులు ఈ మందు పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేందర్, ముస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, ఇతర మార్కెట్ కమిటీల అధికారులు మద్యం సేవించి చిందులేశారు. చేతిలో బీరు బాటిళ్లతో, బ్యాక్ గ్రౌండ్ లో హుషారైన పాటలతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ప్రత్యక్షమైంది.