చంద్రబాబు హయాంలో ఎన్నో హత్యలు జరిగాయి: జోగి రమేష్
- హత్యా రాజకీయాలకు చంద్రబాబుకు పేటెంట్ ఉంది
- ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సాధించింది శూన్యం
- 23 సీట్లకు పరిమితమైనా ఆయనలో పశ్చాత్తాపం లేదు
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేయడంపై టీడీపీ నేతలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారంటూ జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జడ్ ప్లస్ కేటగిరీ అనేది ఏవియేషన్ లో వర్తించదని... ఆ విషయాన్ని ఏపీడీ అధికారులే స్వయంగా చెప్పారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే అధికారులు తనిఖీలు చేశారని చెప్పారు. చంద్రబాబుకు చింత చచ్చినా పులుపు చావలేదని... ఎమ్మెల్యేల సంఖ్య 23కు పరిమితమైనా ఆయనలో పశ్చాత్తాపం లేదని అన్నారు.