మరోసారి ప్రోటోకాల్ తుంగలో తొక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- విమర్శలపాలైన ఇమ్రాన్
- కిర్గిజిస్థాన్ లో అధ్యక్షుడి పట్ల అమర్యాదకర ప్రవర్తన
- సొంత పార్టీ ట్వీట్ లో ఇమ్రాన్ ప్రోటోకాల్ ఉల్లంఘన వెల్లడి
కిర్గిజిస్థాన్ లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ సెమినార్ లో పాల్గొనేందుకు వెళ్లిన ఇమ్రాన్, ఆతిథ్యం ఇస్తున్న దేశాధ్యక్షుడికి కనీస మర్యాద ఇవ్వాలన్న ఇంగితాన్ని మర్చిపోయారు. ప్రారంభ వేడుకల సమావేశం కోసం కిర్గిజ్ అధ్యక్షుడు వస్తుండగా, మోదీ, పుతిన్ తదితర దేశాధినేతలు మర్యాదపూర్వకంగా లేచి నిల్చున్నారు. ఇమ్రాన్ మాత్రం తనకు కేటాయించిన ఆసనంలో అలాగే కూర్చుండిపోయారు. ఇమ్రాన్ సొంత పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ ట్వీట్ చేసిన ఓ వీడియోలో ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన వెల్లడైంది.