Telugudesam: మొహమాటం లేకుండా చెప్పేశారు... చంద్రబాబుతో భేటీలో నేతలు ఎవరేం చెప్పారంటే..!
- ఇవాళ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
- హాజరైన చంద్రబాబు, నేతలు, అభ్యర్థులు
- అభిప్రాయాలు తెలిపిన నేతలు
తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఇవాళ నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర అగ్రనేతలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలపైనే ఈ వర్క్ షాప్ లో చర్చ జరిగింది. ముఖ్యనాయకులు తమ అధినేతతో మొహమాటం లేకుండా తమ అభిప్రాయాలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎవరేం చెప్పారంటే...
వేలమందితో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ లు పెట్టడం సరికాదు. ఈ కాన్ఫరెన్స్ ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయింది.
- అశోక్ గజపతిరాజు
టీడీపీలో మానవ సంబంధాలు తగ్గిపోయాయి. పార్టీ కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు దూరమయ్యారనే అభిప్రాయం ఏర్పడింది. పార్టీ నిర్లక్ష్యానికి గురవుతున్న విషయం పెద్దలు గుర్తించలేదు.
- జూపూడి ప్రభాకర్ రావు
ఆర్టీజీఎస్ నివేదికలు కొంపముంచాయి. గతంలోనూ, ఇప్పుడు అధికారులను పక్కన పెట్టుకోవడం వ్యతిరేక ప్రభావం చూపింది.
- ఎమ్మెల్సీ శ్రీనివాసులు
కోడెల కుటుంబ అక్రమాలపై ఎన్నికల వేళ ప్రజలు ప్రస్తావించారు. గ్రామాల్లో నేతల అవినీతిపై పార్టీ అధినేతకు తెలియజేసే అవకాశమే లేకుండా చేశారు. చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ వాస్తవ పరిస్థితులు అధినేత దృష్టికి వెళ్లకుండా అడ్డుపడింది.
- దివ్యవాణి