బెంగాల్ లో మతం రంగు పులుముకున్న వైద్యుల సమ్మె.. బీజేపీపై మమత సంచలన వ్యాఖ్యలు
- కోల్కతాలో మూడు రోజులుగా వైద్యుల సమ్మె
- ముస్లిం రోగులకు చికిత్స చేయవద్దంటూ బీజేపీ నుంచి ఆదేశాలు ఉన్నాయన్న మమత
- ఆసుపత్రులకు మమత లేఖ
కాగా, సమ్మెకు దిగిన నీల్ రతన్ సిర్కార్ (ఎన్ఆర్ఎస్) మెడికల్ కాలేజీ సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు, ఆసుపత్రులకు మమత లేఖ రాశారు. సమ్మె కారణంగా వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని, రోగులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. జిల్లాల నుంచి వచ్చిన చాలామంది పేద రోగులు చికిత్స పొందుతున్న విషయాన్ని మర్చిపోవద్దని కోరారు.
ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి బంధువులు ఓ వైద్యుడిపై దాడిచేశారు. ఈ ఘటనలో వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తమకు రక్షణ కల్పించాల్సిందిగా వైద్యులు సమ్మెకు దిగారు. సమ్మె పిలుపుతో ఎమర్జెన్సీ వార్డులు, అవుట్ డోర్ సేవలు, పాథలాజికల్ యూనిట్లతోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు మూతపడ్డాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఈ సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.