: రెచ్చగొడుతున్న కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలి: లగడపాటి రాజగోపాల్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విరుచుకుపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న కేసీఆర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖలో ఆయన కోరారు. కావాలంటే అందుకు సాక్ష్యాలుగా ఆయన ప్రసంగించిన వీడియో సీడీలను చూపుతామన్నారు. వేర్పాటువాద ఉద్యమం అంటూ తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం కలిగేలా ఆయన ప్రవర్తిస్తున్నారని లగడపాటి విమర్శించారు.