: ఐపిఎల్ ఫిక్సింగ్ ఎలా బయటపడింది?
వాస్తవానికి ఢిల్లీ పోలీసులు బలవంతపు వసూళ్లకు సంబంధించిన ఒక కేసులో కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా క్రికెటర్ల పేర్లు వారి చెవిన పడ్డాయి. దీంతో పోలీసులు క్రికెటర్ల ఫోన్ కాల్స్ పై నిఘా వేయగా.. ఫిక్సింగ్ వ్యవహారం బయటకొచ్చిందని సమాచారం. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ బుకీల పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 50 కాల్స్ భారత్ నుంచి దుబాయ్ కు వెళ్లాయని, అక్కడి నుంచి మళ్లీ ఇక్కడకు వచ్చాయని పోలీసు వర్గాల సమాచారం.
ఫిక్సింగ్ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగిన ఫోన్ కాల్స్ రికార్డులున్నాయని వారు తెలిపారు. ముంబై, మొహాలీ, ఢిల్లీలో జరిగిన మ్యాచులతో పాటు ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన అన్ని మ్యాచులను పరిశీలిస్తున్నామని చెప్పారు.