: ఫిక్సర్లపై బీసీసీఐ సస్పెన్సన్ వేటు


స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్లపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సస్పెండ్ చేసి ఉపశమన చర్యలు చేపట్టింది. మరో వైపు కేరళ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. శ్రీశాంత్ పై ఆరోపణలు ఋజువైతే అతన్ని క్రికెట్ నుంచి బహిష్కరిస్తామని తెలిపింది. బీసీసీఐ చేతగానితనం వల్లే ఫిక్సింగ్ భూతం జడలువిప్పుతోందని మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ ధ్వజమెత్తారు. ఇలాంటి ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ బీసీసీఐ సరిగా స్పందించడం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News