utthej: నాకు బ్రేక్ రాకపోవడానికి అదే కారణం: నటుడు ఉత్తేజ్
- 'శివ' సినిమాతో పరిచయం
- 'చందమామ'లో మంచి పాత్ర
- హిట్లు లేకపోతే కష్టం
'శివ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన 'ఉత్తేజ్' ఆ తరువాత అనేక చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. " స్టార్ హీరోతో చేసినా .. పెద్ద డైరెక్టర్ తీసినా ఆ సినిమా హిట్ కావాలి.
అలా ఓ మూడు హిట్లు వెంటవెంటనే పడాలి. వేణుమాధవ్ కి 'దిల్' .. 'సింహాద్రి' .. 'ఆది' ఇలా వరుసగా హిట్లు పడటంతో, నలుగురి నోళ్లలో ఆయన పేరు నానింది. దాంతో అవకాశాలు పెరగడం .. నిలబడిపోవడం జరుగుతుంది. నాకు 'చందమామ' హిట్ వచ్చాక చాలా కాలానికి 'మహాత్మ' .. మళ్లీ చాలాకాలానికి 'టాక్సీవాలా' ఇలా ఇంత గ్యాప్ రాకూడదు. మంచి పాత్రలు వెంటవెంటనే పడకపోవడం వల్లనే నాకు బ్రేక్ రాలేదు" అని ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు.