: ఫేస్ బుక్ రాతగాళ్ల అరెస్టుకు నిబంధనలు పాటించాల్సిందే
షోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వివాదాస్పద రాతలకు సంబంధించి వ్యక్తులను అరెస్ట్ చేయాలంటే అందుకు సీనియర్ పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి అరెస్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మహిళా ఉద్యమ నేత జయ వింధ్యాల దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జయ తన ఫేస్ బుక్ అకౌంట్ లో తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.