రాజశ్యామల అమ్మవారికి జగన్ తో ప్రత్యేక పూజలు చేయించనున్న స్వరూపానందేంద్ర
- అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం
- ఎన్నికల తరువాత తొలిసారి విశాఖకు జగన్
- మరికాసేపట్లో ప్రత్యేక పూజలు
ఎన్నికల్లో పోటీ చేసే ముందు స్వరూపానందేంద్ర ఆశీర్వాదాన్ని జగన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై అఖండ విజయాన్ని జగన్ సొంతం చేసుకున్నారు. ఈ కారణంతోనే మరోసారి స్వామి ఆశీస్సుల కోసం జగన్ వస్తుండటంతో, జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా పీఠంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.