Telangana: కుక్కపిల్లలకు బారసాల నిర్వహించిన యజమానురాలు

  • దుబ్బాకలో ఘటన
  • ఏడు పిల్లలను పెట్టిన శునకం
  • అందరినీ ఆహ్వానించి వేడుక జరిపిన యజమాని

తెలంగాణలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం సారంపల్లిలో దేవవ్వ అనే మహిళ ఓ కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది. ఆ కుక్క ఇటీవలే ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో దేవవ్వ ఎంతో మురిసిపోయింది. అంతేకాదు, ఆ కుక్క పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించి ఔరా అనిపించింది. బారసాల సందర్భంగా పసిబిడ్డలకు నామకరణం చేసినట్టు ప్రతి ఒక్క కుక్కపిల్లకు పేరు పెట్టింది.

వాటికి అనువుగా కొత్త బట్టలు కుట్టించి తొడగడమే కాదు, చంటిపిల్లలను ఉయ్యాలలో వేసినట్టు ఉయ్యాలలో పడుకోబెట్టి లాంఛనాలన్నీ జరిపించింది. ఈ సందర్భంగా దేవవ్వ తన బంధుమిత్రులను, గ్రామస్తులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేసింది. ఈ వెరైటీ బారసాలకు వచ్చినవారు ఎంచక్కా కుక్కపిల్లలను దీవించి, అల్పాహారం సేవించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

  • Loading...

More Telugu News