Telangana: అప్పటి ఫలితాల్లో ఫెయిల్... రీవెరిఫికేషన్ లో పాస్... కానీ ఈ భూమ్మీద లేని అనామిక!

  • ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి బలైన అనామిక
  • ఫెయిల్ కావడంతో ఆత్మహత్య
  • ఇప్పుడు పాస్ అంటూ ఫలితాల్లో వెల్లడి

తెలంగాణలో ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాలు ఎన్ని జీవితాలను బలి తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్ మార్కులు తప్పులు తడకలుగా రావడంతో 20 మంది వరకు బలవన్మరణం చెందారు. తాజాగా ఇంటర్ పేపర్ల రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల చేయగా, అత్యంత విచారకరమైన ఘటన చోటుచేసుకుంది.

ఆరుట్ల అనామిక అనే అమ్మాయికి ఏప్రిల్ లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తెలుగులో 20 మార్కులే వచ్చాయి. ఇప్పుడు అదే పేపర్ ను రీవెరిఫికేషన్ చేయగా 48 మార్కులతో పాస్ అని వచ్చింది. కానీ, తన మార్కులు చూసుకోవడానికి అనామిక ఈ లోకంలేదు. ఏప్రిల్ లో ఫలితాలు వచ్చినప్పుడే తాను ఫెయిలయ్యానంటూ మనస్తాపం చెంది తనువు చాలించింది. ఇప్పుడామె పాస్ అని ఇంటర్ బోర్డు పేర్కొంటుండడం అందరినీ కలచివేసింది.

  • Loading...

More Telugu News