Jagan: హైదరాబాద్ చేరుకున్న జగన్... నేరుగా రాజ్ భవన్ కు!
- గవర్నర్ తో భేటీ
- సీఎం హోదాలో తొలిసారి హైదరాబాద్ రాక
- సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న జగన్
ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడ్నించి నేరుగా రాజ్ భవన్ కు పయనం అయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరగనుంది. ఏపీ సీఎం జగన్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇఫ్తార్ విందులో పాల్గొనాలంటూ ఆహ్వానాలు వెళ్లాయి. అందుకోసమే జగన్ హైదరాబాద్ వెళ్లారు. సీఎం హోదాలో జగన్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం.