Jagan: జగన్ దూకుడు... మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చలు
- విజయవాడ గేట్ వే హోటల్లో గవర్నర్ ను కలిసిన జగన్
- ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చ
- రేపు జగన్ ప్రమాణస్వీకారం
ఏపీ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్మోహన్ రెడ్డి అప్పుడే మంత్రివర్గ విస్తరణపై దృష్టిపెట్టారు. తానింకా సీఎంగా ప్రమాణం చేయకున్నా, కీలకమైన క్యాబినెట్ లో ఎవరెవరిని తీసుకోవాలన్నదానిపై ఇప్పటికే ఆయన స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ప్రమాణస్వీకారం ముగిసిన అనంతరం శాఖల వారీగా సమీక్షలు జరిపేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఆయన గవర్నర్ నరసింహన్ తో విజయవాడ గేట్ వే హోటల్ లో భేటీ అయ్యారు. రేపటి ప్రమాణస్వీకారోత్సవం కోసం విజయవాడ వచ్చిన గవర్నర్ తో జగన్ అనేక విషయాలు చర్చించారు. ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్ల తీరుతెన్నులపైనే కాకుండా, మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం తదితర అంశాలపై మాట్లాడారు.