కడపకు బయలుదేరిన జగన్.. వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న నేత!
- తొలుత పెద్దదర్గా సందర్శన
- సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక పూజలు
- రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం
ఆ తర్వాత ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించనున్నారు. పర్యటన ముగిశాక ఈరోజు సాయంత్రమే జగన్ విజయవాడకు చేరుకుంటారు. రేపు మధ్యహ్నం 12.23 గంటలకు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.