: తమిళ సినిమాలకు శ్రీలంక చెక్!


శ్రీలంక - తమిళనాడు మధ్య వివాదం ముదురుతోంది. శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వ అణచివేత విధానానికి వ్యతిరేకంగా తమిళనాడు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సినీ ప్రముఖులంతా చెన్నయ్ లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. ఈ నేపథ్యంలో తమిళ సినిమాలను శ్రీలంకలో నిషేధించాలనే లంకేయుల డిమాండ్లు ఊపందుకున్నాయి.

తమిళ స్టార్ల సినిమాలు మామూలుగా తమిళనాడు, శ్రీలంకలో ఒకేసారి విడుదలవుతుంటాయి. శ్రీలంక నుంచి మంచి ఆదాయాన్ని కూడా ఈ సినిమాలు సంపాదించుకుంటాయి. కాగా 'రావణ బలయా' అనే ఓ బుద్దిస్ట్ గ్రూప్ తమిళ సినిమాలకు వ్యతిరేకంగా గట్టి ఉద్యమమే చేస్తోందిప్పుడు. ‘శ్రీలంకలో తమిళ సినిమాలకు పూర్తిగా తెరపడాలనేది మా డిమాండ్. కమల్, రజనీ, శరత్ కుమార్ వంటి హీరోల సినిమాలు కచ్చితంగా ఇక్కడ విడుదల చేయకూడదు’ అని రావణ బలయా సభ్యుడొకరు తెలిపారు.

  • Loading...

More Telugu News